• Login / Register
  • TGPSC Results |గ్రూప్‌-4 తుది ఫ‌లితాలు విడుద‌ల

    TGPSC Results |గ్రూప్‌-4 తుది ఫ‌లితాలు విడుద‌ల
    వెబ్‌సైట్‌లో ఫ‌లితాల జాబితా 

    Hyderabad :  రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రుపున టీజీపీఎస్సీ నిరుద్యోగుల‌కు, యువ‌త‌కు మంచి వార్త చెప్పింది. తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TGPSC) గురువారం  గ్రూప్-4కు సంబంధించిన తుది ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది. మొత్తం 8,084 మందితో కూడిన ప్రొవిజిన‌ల్ జాబితాను విడుద‌ల చేసింది. 2022 డిసెంబ‌ర్ 1న ఇచ్చిన నోటిఫికేష‌న్‌లో 8,180 పోస్టులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ పోస్టుల కోసం గ‌తంలోనే 9,51,321 మంది అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు  ప‌బ్లిక్ స‌ర్వీస్‌ క‌మిష‌న్ పేర్కొన్న‌ది. ఈ పోస్టుల భ‌ర్తీ కోసం ప‌లు విడుత‌లుగా అభ్య‌ర్థుల‌ ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీలన పూర్తి చేశారు. అనంత‌రం ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఉద్యోగాల‌కు ఎంపికైన తుది జాబితా టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టారు. అయితే ఆ ఫ‌లితాల‌కు సంబంధించిన‌ పూర్తి వివ‌రాలు తెలుసుకోవడం కోసం టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ను సంద‌ర్శించాల‌ని స‌ర్వీస్ క‌మిష‌న్ అధికారులు తెలిపారు.
    *  *  *

    Leave A Comment